
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న కారణంగా దుకాణదారులకు హైదరాబాద్ CP సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. చైనీస్ మాంజా పై పోలీసులు కఠిన ఆంక్షలు తీసుకుంటున్నారు. ఈ చైనీస్ మాంజా అనే దారం ప్రజల ప్రాణాలకు మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పుగా మారిపోయింది అని.. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులందరూ కూడా దీనిపై కఠిన ఆంక్షలు తీసుకోవాలి అని ఆకాంక్షించారు. చైనీస్ మాంజాను విక్రయించినా లేదా నిల్వ ఉంచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు.
Read also : తండ్రైన తెలుగు స్టార్ క్రికెటర్..?
ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని స్పష్టం చేశారు. కాబట్టి ఎక్కడైనా కూడా ఈ చైనీస్ మాంజా విక్రయించినట్లు లేదా కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలి అని లేదా 949061655 ఈ వాట్సాప్ నెంబర్ కు సమాచారం అందివ్వాలి అని సజ్జనార్ కోరారు. కాగా గత ఏడాది వరకు ఎంతోమంది ఈ చైనీస్ మాంజా వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికే చాలామంది వాహనదారులకు వివిధ రాష్ట్రాలలో పోలీసులు టెక్నాలజీతో కూడిన కొన్ని కిట్లు అందజేస్తున్నారు. చైనీస్ మాంజా అనే దారం చాలా ప్రమాదకరమని.. అది గాలిలో స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది అని వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు వారి ఆంక్షలును పాటించాలి అని లేదంటే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని ఆదేశించారు.
Read also : హిందూ మహిళను అత్యాచారం చేసి.. చెట్టుకు కట్టేసి!.. (VIDEO)





