
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ వరల్డ్ వన్డే కప్పులో విశ్వ విజేతగా నిలిచినటువంటి భారత మహిళలు జట్టుకు ఎందరో ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. భారత్ కు విజయాన్ని అందించిన మహిళల జట్టుకు పలువురు ప్రముఖ వ్యక్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఫైనల్స్ లో విశ్వవిజేతగా నిలిచినటువంటి భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు అని.. ధైర్యంగా ఆడడమే కాకుండా వారి ఆత్మవిశ్వాసం వేరే లెవెల్ లో ఉంది అని.. ఈ ఘనవిజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా ట్విట్ చేశారు. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు.. విశ్వవిజేతగా నిలిచినటువంటి మన ఛాంపియన్లకు ఇవే నా అభినందనలు అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక ఈ విజయం ఎప్పటికీ ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి విధంగా ఉంటుంది అని.. చరిత్రలో నిలిచే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. మన తెలుగు ప్లేయర్ శ్రీ చరని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల వ్యక్తులే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రముఖులందరూ కూడా భారత జట్టు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న మైదానంలోనే మ్యాచ్ ను లైవ్ లో వీక్షిస్తున్నటువంటి చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మ్యాచ్ గెలుపొందిన అనంతరం ఆనందంతో బాగోదు వేగానికి గురయ్యారు.
Read also : జగన్ కు ప్రతిదీ రాజకీయమే.. మరోసారి రుజువు చేశారు : టీడీపీ
Read also : బిగ్ బాస్ లో నుంచి మరో వైల్డ్ కార్డు అవుట్.. దడ పుట్టిస్తున్న ఇంటర్వ్యూ?





