లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో చైనా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. వాస్తవాధీన రేఖ సమీపంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షింజియాంగ్ మిలిటరీ కమాండ్ ఈ విన్యాసాలు చేపట్టింది. అత్యంత కఠిన, ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్ సరఫరా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది.
ఈ నెల 15న భారత సైనిక వ్యవస్థాపక దినోత్సవం జరగనున్న తరుణంలో చైనా విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.అత్యాధునిక సైనిక సాంకేతికత, వాహనాలు, మానవ రహిత వ్యవస్థలు, డ్రోన్లను చైనా ఆర్మీ వినియోగిస్తోంది. యుద్ధ సమయాల్లో బలగాలకు అవసరమైన ఆయుధాలు, పరికరాలు, ఆహారం, మందులు ఇతర కీలక సామాగ్రి సరఫరా చేసే విషయంపై దృష్టి సారించింది. చలి, మంచు తీవ్రంగా ఉండే వాతావరణాన్ని తట్టుకునేలా చైనా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.
Read also
1.మహా కుంభమేళ!… రెండు లక్షల కోట్లు ఆదాయం : సీఎం
2.పులివెందుల డీఎస్పీ నాయక్‌ను బహిరంగంగా బెదిరించిన జగన్