
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలోని జడ్పిహెచ్ఎస్ స్కూల్లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలను మరియు ఉపాధ్యాయులను ఉద్దేశించి కొన్ని కీలక విషయాలను చెప్పారు. ప్రస్తుత రోజుల్లో గురువులంటే పిల్లలకు మర్యాద ఉండట్లేదు అని పిల్లలను హెచ్చరించారు. ఈ రోజుల్లో ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే ఆ తల్లిదండ్రులకు చాలా కష్టమైపోతున్న తరుణంలో ఒకేసారి కొన్ని వందల మంది విద్యార్థులను కంట్రోల్ చేస్తూ పాఠాలు చెబుతున్నటువంటి ఉపాధ్యాయులు చాలా గ్రేట్ అని కొనియాడారు. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం అనేది ఒక గొప్ప లక్షణం అని విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. గురువుల దీవెనలతో జీవితంలో ఎదగగలమని.. క్రమశిక్షణ అనేది విద్యార్థులకు ఈ స్కూల్ డేస్ లోనే నేర్పాలి అని ఉపాధ్యాయులకు సూచించారు. ఇందులో భాగంగానే పిల్లలు మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు అని.. ఫోన్లు మరియు లాప్టాప్ లు పక్కన పెట్టి శ్రద్ధగా పుస్తకాలను మాత్రమే చదవాలి అని పవన్ కళ్యాణ్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్లు ఉపయోగించాల్సిన సమయం ఇంకా చాలా ఉంది అని.. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీకు తెలుస్తుంది అని తెలిపారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇప్పటినుంచి చక్కగా చదువుకోవాలని.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. చదువుతోపాటు ఆటలు మరియు పాటలు కూడా ముఖ్యమే అని వ్యాఖ్యానించారు.
Read also : ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక అసలు కారణం ఇదే : రస్సెల్
Read also : Weather: రేపటి నుంచి జాగ్రత్త.. మరో 4 రోజులు వణకాల్సిందే..





