తెలంగాణరాజకీయం

నేడు నారాయణపేట,వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు  వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మరియు నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణాల్లో పర్యటించనున్నారు.
ఆయన సుమారు రూ. 558 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రూ. 5 వేల కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-మక్తల్-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం మక్తల్‌లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button