క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. కార్తీకమాసం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చికెన్ కొనుగోలు చేయడం తగ్గిస్తారు అని.. దీని ప్రభావం చికెన్ ధరలపై పడేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఎక్కడా కూడా చికెన్ ధరలు తగ్గలేదు. కార్తీకమాసం అయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇంతకుముందు లాగానే సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో స్కిన్లెస్ చికెన్ కేజీ 210 నుంచి 250 రూపాయలు పలుకుతుంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ. 240 వరకు పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 250 రూపాయలు, ఏలూరు జిల్లాలో 240 రూపాయలు, ఇక విశాఖపట్నంలో 260 రూపాయలు పలుకుతుంది. దీంతో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో కేజీ 260 రూపాయలు పలకడంతో వైజాగ్ ప్రజలు ఆశ్చర్యపోయిన కొనుగోలు చేయడంలో మాత్రం వెనకాడడం లేదు.
Read also : T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ.. రీజన్ ఇదే?
కార్తీక మాసం అయినప్పటికీ కూడా నేడు ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు మరింత పెరిగాయి. దీంతో కార్తీక మాసంలో పూజలు చేసేటువంటి భక్తులు తగ్గిపోయారా అని ప్రశ్నలు అందరి మెదడులోని మెదులుతున్నాయి. మరోవైపు భక్తి భక్తే అని… తిండి తిండే అని మరి కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా గతంలో కంటే ఇప్పటి కాలం పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు కార్తీక్ మాసం అంటే చికెన్ మొదలుకొని నాన్ వెజ్ ఏదైనా కూడా దాదాపు 90 శాతం వరకు ఎవరు ముట్టుకునే పరిస్థితి కనపడదు. కానీ నేడు కార్తీక మాసం అంటే మరి ముఖ్యంగా యువతకు తెలియకుండా పోయింది. తల్లిదండ్రులే తమ పిల్లలకు పండుగల గురించి వివరించాలి.. లేదంటే భవిష్యత్తు కాలంలో ఇలాంటి పండుగలు ఉన్నాయా అని చెప్పుకోవాల్సి వస్తుంది అని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : “బాహుబలి ది ఎపిక్” ఫస్ట్ డేనే కలెక్షన్ల జోరు..!





