Homeక్రైమ్Chhattisgarh Tragedy: కొడుకు మృతిని తట్టుకోలేక పేరెంట్స్ ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్!

Chhattisgarh Tragedy: కొడుకు మృతిని తట్టుకోలేక పేరెంట్స్ ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్!

  • మృత్యువులోనూ కుమారుడి చెంతకే చేరాలని

  • చెట్టుకు ఉరేసుకుని తల్లిదండ్రుల ఆత్మహత్య

  • ఛత్తీస్‌గఢ్‌‌లో కంటతడి పెట్టించే ఘటన  

ఛత్తీస్‌గఢ్‌ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెట్టుకు చీరతో ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు గల కారణాన్ని నాలుగు పేజీల లేఖలో వివరించారు. ఎంతోఅన్యోన్యంగా ఉండే దంపతులు మరణించడంతో స్థానికంగా విషాధ ఛాయాలు అలుముకున్నాయి.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

ఛత్తీస్‌ గఢ్ లో జాంజ్‌గిర్-చంపా జిల్లా పరిధిలోని ధర్దేయ్ అనే గ్రామంలో కృష్ణా పటేల్(48), రమాబాయి(47) నివాసం ఉంటున్నారు. వారికి ఆదిత్య అనే 21 ఏళ్ల కుమారుడు ఉండే వాడు. అతడు 2024లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒకగానొక్క కొడుకు మరణించడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పటి వరకు ఆదిత్య సందడితో కలకలలాడి ఆ ఇళ్లు ఒక్కసారిగా బోసి బోయింది. కుమారుడి మరణంతో కృష్ణా దంపతులు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నారు. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా కలిసే వారు కాదు. ఇలా రెండేళ్లు గడిపిన కృష్ణా దంపతులు.. ఆదివారం దారుణ నిర్ణయం తీసుకున్నారు.

ఇంటి ప్రాంగణంలోని చెట్టుకు ఉరేసుకుని..

తాజాగా కృష్ణా పటేల్, రమా భాయ్ దంపతులు వారి ఇంటి ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జంట చనిపోయే ముందు నాలుగు పేజీల లేఖ, ఒక వీడియోను విడుదల చేశారు. “ఆదిత్యనే మా ప్రపంచం. అతడు లేని జీవితం మాకు వృథా అనిపిస్తుంది. మేము కూడా దేవుడి దగ్గరకు వెళ్తున్నాము. మా కొడుకు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాము. మా మరణం గురించి ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. మాకు సంబంధించి రావాల్సిన డబ్బులు మా అన్నయ్యకు దక్కేలా చూడండి” అంటూ లేఖలో రాశారు. కృష్ణా తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. కృష్ణా, రమ తమతో ఎంతో కలివిడిగా ఉండేవారని, కుమారుడి మరణంతో వారిద్దరు ఒక్కసారిగా కుంగిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ప్రైవేట్ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి.. నటికి దారుణ అనుభవం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments