Tuesday, February 24, 2026
Homeజాతీయంవిమానంలో సాంకేతిక లోపం, ప్రయాణీకులలో భయాందోళన!

విమానంలో సాంకేతిక లోపం, ప్రయాణీకులలో భయాందోళన!

Flight Emergency Landing: గత కొద్ది రోజలుగా విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అలర్ట్ అయిన పైలెట్ చెన్నై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.

నెల్లూరు సమీపంలో సాంకేతిక సమస్యలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత చాలా మంది విమానం ఎక్కేందుకు భయడుతున్నారు. పలు విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా సాంకేతిక సమస్య కారణంగా చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన విమానం వెను తిరిగి చెన్నై ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నెల్లూరు సమీపంలో గాల్లో ఉండగా, విమానంలో సమస్య ఏర్పడినట్లు పైలెట్ గుర్తించాడు. వెంటనే ఆయన ఏటీసీ అధికారులను అలర్ట్ చేశాడు. వారి సూచనల మేరకు విమానాన్ని చెన్నైకి మళ్లించాడు. చెన్నై ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా దింపినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ విమానంలో 159 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లింపు

అటు ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా దారి మళ్లించారు అధికారులు. ఈ విమానం టోక్యో నుంచి ఢిల్లీకి వస్తుండగా, కోల్‌ కతా ఎయిర్ పోర్టుకు మళ్లించారు. విమానం క్యాబిన్‌ లో అధిక ఉష్ణోగ్రత ఏర్పటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. వరుస సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణం అంటేనే ప్యాసింజర్లు భయపడే పరిస్థితి నెలకొంది.

Read Also: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. ఎన్ని రోజులంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments