న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్ః పశ్చిమాసియాలో యుద్దం అంతకంతకు తీవ్ర రూపం దాల్చుతుంది. కాగా ఈజిగా గెలుస్తామని ఇరాన్ పై అమెరికా మొదలు పెట్టిన యుద్దం ఇప్పటితో ముగిసేలా లేదు. దీంతో అమెరికా యుద్దం ప్రభావంతో నష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ఇరాన్‌ను ట్రంప్ సర్వనాశనం చేసే దిశగా వెళ్తున్నాడు. అమెరికాలో ట్రంప్‌నిర్ణయాలపై వ్యతిరేకత భారీగా పెరిగిపోతుంది.దీంతో ట్రంప్ ను గద్దె దింపే విషయంపై ఆయన సొంత పార్టీతో పాటు డెమోక్రాట్లు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్యంగంలోని ఓ రూల్ వాడుకుంటారనేది తెలుస్తుంది.
అమెరికా రాజ్యంగంలో ఏముందంటే…
అమెరికా రాజ్యంగంలో 25 సవరణ అధ్యక్ష వారసత్వం, అసమర్థతకు సంబంధించినదిగా ఉంది. అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసిన, సేవ చేయడానికి అసమర్థుడైన దీనిని అమలు చేసేందుకు వీలుంటుంది. ట్రంప్ ఇరాన్‌పై తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ 25వ రాజ్యాంగ సవరణ ద్వారా గద్దె దింపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ స్థానంలో ఎవరన్న దానిపై చర్చ జరుగుతుండగా దానికి ముందుగా కనిపించేది ఉపాద్యక్షుడు జేడీ వాన్స్ కనిపిస్తున్నారు.తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త అయిన జేడీ వాన్స్ ను ట్రంప్ స్ధానంలో అధ్యక్షుడిగా చేసే అవకాశముంది.
సొంత కేబినేట్ బావిస్తే తక్షణమే అధికారం బదిలీ…
ట్రంప్ ను తన సొంత కేబినెట్ అంతా కలిసి అధ్యక్షుడిగా పనికిరాడని భావిస్తే తక్షణం అతని అధికారాల్ని తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదిలీ చేయమని కోరే అవకాశం ఉంది. దీన్ని ఇప్పుడు అతని కేబినెట్ సహచరులు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనేది తాజా సమాచారం. అదే జరిగితే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు అమెరికా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయి. వాస్తవానికి జేడీ వాన్స్ కూడా ట్రంప్ చర్యల్లో భాగస్వామి కాకుండా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అలాగే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు కూడా గతంలో పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు
