
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : నల్లగొండ జిల్లా, చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ రెండో వార్డు బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన అన్నెపర్తి శేఖర్ శుక్రవారం తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్‌కు ముందుగా అన్నెపర్తి శేఖర్ స్థానిక ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేకంగా దండం పెట్టి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. సంప్రదాయబద్ధంగా, ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ దృశ్యం ఆయనకు ప్రజల్లో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని మరోసారి చాటింది.

వార్డు సమస్యలపై పట్టు, ప్రధాన బలం రెండో వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై పూర్తి అవగాహన అన్నెపర్తి శేఖర్‌కు ఉందని స్థానికులు చెబుతున్నారు. సమస్యలను కేవలం ప్రస్తావించడం కాదు, వాటికి పరిష్కార మార్గాలు చూపగల రాజకీయ నైపుణ్యం ఆయనకు ప్రధాన బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో పెరిగిన విశ్వాసం… ఇప్పటికే సామాజిక కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చిన అన్నెపర్తి శేఖర్, అందుబాటులో ఉండే నాయకుడు అనే ముద్రను సంపాదించుకున్నారు. ఇదే కారణంగా రెండో వార్డులో ఆయనకు సహజమైన ప్రజా మద్దతు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితుల మధ్య ఎదుగుదల అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడులు, రాజకీయ అడ్డంకులు ఎదురైనా, వెనుకడుగు వేయకుండా అంచెలంచలుగా ఎదగాలనే తపనతో ముందుకు సాగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ పోరాటమే ఆయన రాజకీయ ప్రయాణానికి మరింత బలం చేకూర్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గెలుపుపై రాజకీయ వర్గాల అంచనా.. ప్రస్తుత పరిస్థితులు, ప్రజల మద్దతు, వార్డు స్థాయి సమీకరణలను పరిశీలిస్తే, చండూరు మున్సిపల్ రెండో వార్డులో అన్నెపర్తి శేఖర్ గెలుపు సునాయాసమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ఫలితం అనామత్‌గా మారిందనే చర్చ చండూరులో జోరుగా సాగుతోంది.





