ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌ - పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అరెస్ట్‌ భయం..!

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… వైసీపీ హయాంలో చక్రం తిప్పారు. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డికి మాత్రమే కాదు.. ఆయన ఫ్యామిలీ మొత్తానికి చుక్కలు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే ఏంటో.. పెద్దిరెడ్డికి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. తనతో పెట్టుకుంటే.. ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం.. సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేకపోతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

వైసీపీ హయాంలో.. రాయలసీమలో రాజకీయమంతా పెద్దిరెడ్డిదే. వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే.. పెద్దిరెడ్డి రాయలసీమకు ముఖ్యమంత్రి అన్నట్టు చక్రం తిప్పారు. జగన్‌ వైనాట్‌ 175 అంటే.. పెద్దిరెడ్డి వైనాట్‌ కుప్పం అన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని విశ్వప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్‌ ఓటమిని చవిచూసినట్టే.. 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఇంటికి పంపాలనుకున్నారు. కానీ… సీన్‌ రివర్స్‌ అయ్యింది. తాను ఒకటి తలిస్తే.. ప్రజలు ఇంకోటి తలచారు. కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. అలాంటి.. ఇలాంటి గెలుపు కాదు.. వైసీపీ చావుదెబ్బ కొట్టి.. ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి.. కనీవినీ ఎరుగని మెజారిటీతో కూటమికి పట్టం కట్టారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి ఆటలు ఖేల్‌ ఖతమయ్యాయి. ఆయనతోపాటు ఆయన ఫ్యామిలీని కూడా కష్టాలు చుట్టుముట్టాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్‌ చేసింది. రాయలసీమలో రాజకీయంగా పట్టుసాధించాలంటే.. పెద్దిరెడ్డికి చెక్‌ పెట్టాల్సిందే అని ఫిక్స్‌ అయ్యారు చంద్రబాబు. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు… పెద్దిరెడ్డి ఫ్యామిలీలోని మహిళలపై కూడా కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డితోపాటు కొందరు కుటుంబసభ్యులపై అటవీ భూముల ఆక్రమణ కేసులు పెట్టారు. ఆ తర్వాత లిక్కర్‌ స్కామ్‌లో మిథున్‌రెడ్డిపై కేసు ఉంది. మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అందుకే మిథున్‌రెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్‌ కాలేదు. కానీ.. దీనిపై న్యాయపోరాటం చేసి.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ చేయాలని చూస్తోంది కూటమ ప్రభుత్వం. లిక్కర్‌ కేసును స్వయంగా సీఎం చంద్రబాబే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.

ఇక.. పెద్దిరెడ్డిపై, ఆయన సోదరుడు, కుటుంబసభ్యులపై నమోదైన అటవీ భూమి ఆక్రమణ కేసు కూడా చాలా బలమైంది. ఆ కేసు నుంచి పెద్దిరెడ్డి భయటపడటం జరగదు. ఎందుకు అటవీ చట్టాలు అంత స్ట్రాంగ్‌ ఉంటాయి. ఈ కేసును… అటవీ మంత్రిత్వ శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇలా.. పెద్దిరెడ్డిని, ఆయన ఫ్యామిలీ కూడా దెబ్బకొట్టి.. రాయలసీమలో రాజకీయంగా బలపడాలన్నది చంద్రబాబు ప్లాన్‌. ఈ విషయంలో లోకేష్‌ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారట. సో… పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కష్టాలు తప్పేలా లేవు. కుప్పంలో చంద్రబాబును దెబ్బకొట్టాలని చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి… ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడింది. ఆయన కుటుంబం మొత్తం అరెస్టుల భయంతో వణికిపోతోంది. రేపో, మాపో మిథున్‌రెడ్డి అరెస్ట్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి సోదరుడు.. ఆపై పెద్దిరెడ్డి. మొత్తంగా… కేసుల నుంచి తప్పించుకోలేక… నియోజకవర్గంలో ఉండలేక.. ఆయన పడుతున్న బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button