
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త రికార్డు నమోదు చేశారు. మన భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి స్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా తెలిపింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆస్తులు మొత్తం 931 కోట్లకు పైగా ఉన్నాయి. అయితే అతనికి 10 కోట్ల వరకు అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు మన భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు నమోదు చేశాడు. మరోవైపు 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండ్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే అత్యంత తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారు. మమతా బెనర్జీ మొత్తం ఆస్తులు కేవలం 15 లక్షలు మాత్రమే. దీంతో మరీ ఇంత తక్కువ ఆస్తులా?.. అని సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read also : తెలంగాణలో మరో కొత్త పార్టీ – పెట్టబోయేది ఎవరో తెలుసా…!
ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లిస్టులో ఏడవ స్థానంలో నిలిచారు. రేవంత్ రెడ్డి మొత్తం ఆస్తులు విలువ 30 కోట్లు మాత్రమే. దీంతో నారా చంద్రబాబు నాయుడుకు, రేవంత్ రెడ్డికి మధ్య చాలానే ఆస్తులు డిఫరెన్స్ ఉంది అని పలువురు చర్చిస్తున్నారు. కాగా 2019 ఎలక్షన్ లు జరిగిన తర్వాత.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన అత్యంత ధనిక ముఖ్యమంత్రుల లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలవడం చూసిన రాష్ట్ర టీడీపీ నాయకులు , ప్రజలు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also : భారత్ లో నూతన రాయబారి, ట్రంప్ కీలక నిర్ణయం!