తెలంగాణ

సెంచరీ కొట్టిన టమాట.. అదే దారిలో ఉల్లి.. వెల్లుల్లి

కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రెండు వారాల్లోనే సీన్ మారిపోయింది. 15 రోజుల క్రితం కిలో టమాట ధర 20 రూపాయలు ఉండగా.. ఇప్పుడు వంద రూపాయలు దాటేసింది. టమాటతో పాటు ఇతర కూరగయాల ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలు కొందామంటేనే జనాలు వణికిపోతున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం టమాట రేట్ 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర 80 రూపాయలు పలుకుతుండగా.. అవి రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి 100 నుంచి 120 రూపాయలు పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా టమాటా రాకపోవడమే ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారులు చెప్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు ధ్వంసమయ్యాయి. సరఫరా తగ్గిపోవటంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోయింది. మాములుగా అయితే సమ్మర్ లో టమాటా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు వర్షాకాలంలోనూ ఎండకాలంలో కంటే కాస్త ఎక్కువగానే టమాటా ధఱలు మండిపోతున్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరుకు లేకపోవటంతో.. ఈ పరిస్థితిని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటూ.. రేట్లు భారీగా పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పండించిన రైతులకు సాధారణ ధరలే చెల్లించి.. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దళారులు క్యాష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ ధరలు మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు కొనసారే అవకాశముందంటున్నారు.

Read More : నల్గొండ కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు.. ఎమ్మెల్యేలు మాకొద్దంటూ నేతల ధర్నాలు

మరోవైపు ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా టమాటతో పోటీ పడుతూ పెరిగిపోతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో మంచి రకం ఉల్లి ధర 60 నంచి 70 రూపాయలుగా ఉంది. సెకండ్ క్వాలిటీ ఉల్లిపాయలను 50 రూపాయలకే కిలో ఇస్తున్నారు.కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. అటు వెల్లుల్లి ధర కూడా ఆకాశాన్నంటుతోంది. రిటైల్ మార్కెట్‌లో మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో 450 నుంచి 500 రూపాయలు పలుకుతోంది.

Back to top button