
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ ముస్లిం అని చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ‘ఎవరూ చట్ట పరంగా మతాన్ని మార్చుకున్నారో చర్చ చేయాలని అనుకుంటే, ఢిల్లీలోని జానపద నుంచే ప్రారంభించాలి’ అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దేశమంతటా కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు నిజం ఎంత? అని చేస్తున్నారు. మరోవైపు ఫిరోజ్ గాంధీ మతపరమైన నేపథ్యాలు ఏంటి అనేది… ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలను ఏ మతం ప్రకారం చేశారు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read More : ట్రోల్స్ కు గురవుతున్న మాజీ ఎంపీ కేసినేని నాని !.. ఎందుకంటే?
ఇక ఫిరోజ్ గాంధీ పూర్తి పేరు “ఫిరోజ్ జహంగీర్ గాంధీ”. ఇతను 1912 సెప్టెంబర్ 12 ముంబైలోని ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. ఫిరోజ్ గాంధీ తండ్రి పేరు జహంగీర్. అతను ఒక ఇంజనీర్. ఒక ఫిరోజ్ గాంధీ యుక్త వయసులోనే స్వాతంత్ర సమరయోధుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఫిరోజ్ గాంధీ విద్యార్థుగా ఉన్నప్పుడు స్వదేశీ ఉద్యమంలో భాగంగా తాను చదువుతున్న బ్రిటిష్ ప్రభుత్వ కాలేజీ నుంచి బయటకు వచ్చారు. ఇక 1933వ సంవత్సరంలో ఇందిరాగాంధీకి ఫిరోజ్ గాంధీ ప్రపోజ్ చేశారు. అయితే అప్పుడు ఇందిరా గాంధీ వయసు 16 ఏళ్లు మాత్రమే. ఇందిరా గాంధీ తల్లి కమల నెహ్రూ కి చాలా మంచి స్నేహితులు. ఇక ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ 1942లో మార్చిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారం వీళ్లిద్దరు పెళ్లి జరిగింది. 1952 వ సంవత్సరంలో జరిగిన భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి స్థానం నుంచి ఫిరోజ్ గాంధీ పోటీ చేసి లోకసభ సభ్యుడు అయ్యారు. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన నేషనల్ హెరాల్డ్, ది నవజీవన్ అనే పత్రికలను ఫిరోజ్ గాంధీ నిర్వహించేవారు.
Read More : సాహితీ మేఖల ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు
ఇక ఫిరోజ్ గాంధీ 48 ఏళ్ల వయసులో 1960 సెప్టెంబర్ 8న గుండెపోటుతో చనిపోయారు. అంతిమ సంస్కారాలను పార్టీ సంప్రదాయం ప్రకారం చేయొద్దని ఆయన తన స్నేహితులతో చెప్పారు. అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం ఫిరోజ్ గాంధీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Read More : పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసిన అభిమానులు!… ఉత్కంఠంగా సాగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ?