
చిట్యాల,క్రైమ్ మిర్రర్:- చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని, పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, సాగు–తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితరసాధ్యమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ప్రజాజీవితంలో చేసిన సేవలు, రాజకీయాల్లో తీసుకువచ్చిన సంస్కరణలను అభిమానులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రాజకీయాలను సేవగా మలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్‌ను టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సీమ లింగయ్య, సీనియర్ నాయకులు బొడిగె విజయ్ కుమార్ గౌడ్, మిద్దెల యాదగిరి, మాజీ సింగిల్విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్ గౌడ్, రత్నం నర్సింహ, జవాజి మత్స్యగిరి, మిద్దెల రామలింగయ్య, అంబాల మారయ్య, బొడిగె యాదయ్య, గోపగోని భాషా, బడే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
తారక రామారావు వర్ధంతి.. సీఎం ట్వీట్ వైరల్?
మాదాపూర్ లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు





