ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

క్రైమ్ మిర్రర్, నిర్మల్ :- ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నిర్మల్ జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో దిలావర్ పూర్ మండల కేంద్రంలో గురువారం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిపాలన కాలంలో కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం చేసింది .కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక చట్టాలను కాల రాసింది. రైతులకు వ్యతిరేకంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో తోకముడిచింది. కానీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా కొనసాగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విబిజి రాంజీ చట్టాన్ని తీసుకువచ్చింది.

Honeymoon Horror: హనీమూన్ మర్డర్ 2.0.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్త లేపేసిన కిలేడీ!

ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు మాత్రమే భరిస్తది. మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడమే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే చట్టాన్ని లేకుండా చేయడానికి కారణం అవుతది.
కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు నష్టం చేసేటటువంటి చర్యలు మానుకోవాలని, డిమాండ్ చేస్తూ,కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని అలి వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలని రోజు కూలి 800 రూపాయలు చెల్లించాలని ఉపాధి హామీలో రోజుకు ₹800 రూపాయల కూలి సంవత్సరానికి 200 దినాలు కల్పించాలని రైతులకు పార్లమెంటులో గిట్టుబాటు ధరలు చట్టం చేయాలని,ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,
ఫిబ్రవరి 12 తేదీనాడు దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, సంచు లింగన్న, దుర్గం పోష లింగన్న, అబ్బాస్, దుప్పి పోశెట్టి లు పాల్గొన్నారు.

Bharat Taxi Launch: అందుబాటులోకి ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు, వీటి ప్రత్యేత ఏంటంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button