
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఎన్నో సినిమాలను ప్రైవసీకి గురిచేసి కొన్ని కోట్ల రూపాయలను సంపాదించినటువంటి ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తాజాగా పోలీసుల అరెస్ట్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే గతంలో ఈ ఐ బొమ్మ నిర్వహక్కుడే “దమ్ముంటే నన్ను పట్టుకోండి” అంటూ సవాల్ విసిరారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని అతి కొద్దిరోజుల సమయంలోనే పట్టుకున్నారు. ఫ్రాన్స్ నుంచి వస్తున్న అతడిని సైబరాబాద్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ ను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతను సంపాదించిన మూడు కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అయితే దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన వ్యక్తిని పోలీసులు చాలా చాక చక్యంగా పట్టుకున్నారు అంటూ హోం శాఖ స్పెషల్ సిఎస్ CV ఆనంద్ పోలీసులను అభినందించారు. గత జూన్ నెల నుంచి ఇప్పటివరకు కూడా సైబర్ క్రైమ్ టీం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టాలు పడింది. ఒక రవిని తప్ప మిగతా వారందరిని పట్టుకోగా… తాజాగా రవి కూడా చిక్కాడు. అతనికి ఎంత ధైర్యం ఉంటే పోలీసులకే సవాలు విసురుతారు.. పాపం అతనికి మన సైబరాబాద్ పోలీసుల పవర్ ఏంటో తెలియకపోవచ్చు అని.. డీసీపీ కవితా మరియు సిపి సజ్జనార్కు కంగ్రాట్స్ అని సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.
Read also : Prime Minister of Japan: నేను రోజుకు 2 గంటలే నిద్రపోతా
Read also : కుమారుడి ఫస్ట్ బర్త్ డే.. ఫోటో షేర్ చేసిన రోహిత్ శర్మ





