
పెబ్బేరు,క్రైమ్ మిర్రర్:- మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని, డ్రైవింగ్ పై అవగాహన లేని మైనర్లు ప్రమాదాల బారిన పడటంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నారని ఎస్ఐ యుగేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కలం నిఘా న్యూస్ విలేఖరితో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని,వారి కదలికలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆయన సూచించారు. పిల్లలపై వున్న ఇష్టంతో ఖరీదైన ద్విచక్ర వాహనాలను,మొబైల్ ఫోన్లను ఇవ్వడంతో వారు తమ కష్టం విలువ తెలియక మత్తు పదార్థాలకు బానిసలై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఇటువంటి వారిపై తల్లి దండ్రులు దృష్టి సారించాలని కోరారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను, కూలీలను తరలిస్తున్నారని, అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మరణాలకు కారుకులవుతున్నారని తెలిపారు. నిబంధనలకు అతిక్రమించిన ఆటోలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని హెచ్చరించారు.
Read also : తుఫాన్ ఎఫెక్ట్… భారీ వాహనాలకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్
Read also : తుఫాన్ ఎఫెక్ట్… భారీ వాహనాలకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్





