క్రైమ్

ఆ సినిమాలు చేస్తుందంటూ.. హీరోయిన్ పై కేసు!

Case On Shwetha Menon: ప్రముఖ మలయాళ హీరోయిన్ శ్వేతా మీనన్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బు కోసం అశ్లీల సినిమాల్లో నటిస్తున్నందుకు కొచ్చి పోలీసులు ఆమెపై చర్యలకు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు తో శ్వేతా మీనన్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా మార్టీన్ మేనాచారీ అనే సామాజిక కార్యకర్త ఎర్నాకులం కోర్టులో శ్వేత మీనన్‌పై కేసు పెట్టాడు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రెవెన్షన్ ఆఫ్ అబ్‌ సీనిటీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఎందుకు ఆమె మీద కేసు నమోదైందంటే?

డబ్బు కోసం ఏ గ్రేడ్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో తెలిపాడు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఫిర్యాదులో వివరించాడు. అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. కానీ, తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాడు. ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

తెలుగు సినిమాల్లోనూ నటించిన శ్వేతా మీనన్

1991లో మలయాళ చిత్రం ‘అనస్వరం’తో శ్వేత తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ‘రతీ నిర్వేదం’, ‘పాలేరీ మానిక్యం’, ‘కాలిమన్ను‌’తో పాటు కం..డోమ్ యాడ్‌ లో నటించింది. తెలుగులోనూ ఆమె పలు సినిమాలు చేసింది. ‘దేశ ద్రోహులు’తో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమా 1995లో విడుదల అయింది. ఆ తర్వాత ‘ఆనందం’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. 2003లో విడుదలైన ‘జూనియర్స్’ సినిమాలో స్పెషల్ రోల్‌ లో కనిపించింది. 2011లో విడుదలైన ‘రాజన్న’ సినిమాలో దొరసాని పాత్రలో నటించింది.

‘అమ్మ’ అధ్యక్ష పదవి కోసం పోటీ

శ్వేత మీనన్ ప్రస్తుతం ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఈ నెల 15న ‘అమ్మ’ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రెసిడెంట్ పదవి కోసం నామినేషన్ వేశారు. ఈ  సమయంలో శ్వేతా మీనన్‌పై కేసు నమోదు కావటం చర్చనీయాంశంగా మారింది.

Read Also: భరణంగా ‘బీఎండబ్ల్యూ’ డిమాండ్‌.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button