
పిట్లం, క్రైమ్ మిర్రర్:- కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం లోని కుర్తి గ్రామం లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి 2,30,000 క్యూసెక్కుల వరద నీరు మంజీరా నదిలో ప్రవహించడంతో నూతన హై లెవెల్ బ్రిడ్జి పై నుండి వరద ప్రవహిస్తుంది. దీనితో కుర్తి గ్రామం జల దిగ్బంధంలో ఉంది. ఈ గ్రామాన్ని పిట్లం మండల అధికారులు గత రెండు రోజుల నుండి సందర్శించి ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సైతం వచ్చి మంజీరా నది ప్రవహాన్ని
సందర్శించి.పిట్లం తాహసిల్దార్ మరియు మండల అధికారులకి బ్రిడ్జ్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంత జరుగుతున్న తనకేమి సంబంధం లేనట్టుగా కుర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయ రెండు రోజుల నుండి మంజీరా,గ్రామం వైపు రాలేదు. ఈరోజు సబ్ కలెక్టర్ వచ్చి వెళ్ళిపోయిన గంట రేపటి వరకు బ్రిడ్జ్ వద్దకు వచ్చి సెల్ఫీ దిగి వెళ్లిపోయారు.పంచాయతీ సెక్రెటరీ విజయ పనితీరు పై గ్రామస్తులు మండిపడుతున్నారు.
Read also : స్టీల్‌ప్లాంట్‌పై జనసేనాని అజెండా ఏంటి.. విశాఖలో ఏం చెప్పబోతున్నారు?
Read also : టీబీజేపీ ఎంపీల విజయంపై వివాదం – ఓట్లు చోరీ చేశారంటున్న కాంగ్రెస్..!