క్రైమ్తెలంగాణ

బెగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా…భారీగా ట్రాఫిక్

క్రైమ్ మిర్రర్ తెలంగాణ : హైదరాబాద్‌లోని బెగంపేట ఫ్లైఓవర్‌ పై అతివేగం కారణంగా ఒక కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

గాయపడిన ముగ్గురిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా బెగంపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button