తెలంగాణ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అలర్ట్!.. అలా చేయకుంటే చర్యలే?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయ సందిగ్ధత ఘటనలు కాస్త ప్రశాంతించాయి. ఇక గెలిచిన అభ్యర్థులు గ్రామాల అభివృద్ధికి ఏమి చేయాలో ఆ పనిలో పడగా ఓడిపోయిన అభ్యర్థులు వారి పని వారు చూసుకుంటున్నారు. అయితే తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరికీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొన్ని కీలక ఆదేశాలు చేసింది. ఎవరైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారో ఆ అభ్యర్థులందరూ కూడా 45 రోజుల్లో వారు ఖర్చుపెట్టిన మొత్తాన్ని కూడా ఒక నివేదిక రూపంలో ఎంపీడీవోలకు సమర్పించాలి అని ఆదేశించారు.

Read also : నువ్వు అరెస్ట్ చేస్తే భయపడాలా.. జగన్ కు వార్నింగ్ ఇచ్చిన లోకేష్

ఒకవేళ ఈ 45 రోజుల్లోగా అభ్యర్థులు ఖర్చు నివేదికలను సమర్పించకపోతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని కీలక హెచ్చరికలు చేసింది. ఖర్చు నివేదికలను 45 రోజుల్లోపు సమర్పించకపోతే గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ బరిలో నిలిచిన వారందరూ కూడా వివరాలు సమర్పించకపోతే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోను పోటీ చేసేందుకు అవకాశం ఉండకుండా చేస్తాము అని పేర్కొన్నారు. దీంతో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే వారి ఖర్చుకు సంబంధించిన నివేదికలను ఎంపీడీవో ఆఫీసులో సమర్పించడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మరో 45 రోజుల్లోపు ఈ ఖర్చు నివేదికలను సమర్పించాలని లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.

Read also : గిల్ బ్యాడ్ లక్, ఇషాన్ కిషన్ కు అదృష్టం.. T20 వరల్డ్ కప్ జట్టు ఇదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button