తెలంగాణ

ఒక ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటారా?.. రేవంత్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే బీసీ రిజర్వేషన్లపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూనే హాట్ కామెంట్స్ చేశారు. బీసీల పేరుతో మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకోవాలా?.. అని ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారని?.. ప్రశ్నించారు. అజహరుద్దీన్ అలాగే షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆనాడు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లనే హైకోర్టు కొట్టి వేస్తే… ఈరోజు ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి నిలదీశారు.

Read also: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాలు సూచన!.. అలర్ట్?

అలాగే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే… బీసీల రిజర్వేషన్ల బాధ్యత స్వయంగా నేను తీసుకుంటానని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన స్థాయికి నుంచి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఒక దేశ ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బిసి అంటారా?.. అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ ఓటమి పక్క అని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అన్నారు. మత రిజర్వేషన్లతో దేశంలో అల్లకల్లోలం జరుగుతుందని అన్నారు. ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తే స్వయంగా నేనే రాష్ట్రపతి, ప్రధాని మోదీతో మాట్లాడుతా అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read also : అరువు తెచ్చుకున్న జనాలతో జగన్ శాంతి భద్రతలకు సమస్యలు సృష్టిస్తున్నారు : బీజేపీ అధ్యక్షుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button