
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కేటీఆర్ ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే రాష్ట్ర బంద్కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కలిసి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఒక కప్పు చాయ్ తాగేలోపు ఇద్దరు కనుక ఓకే చెప్పేస్తే వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లు కాస్త చట్టంగా మారిపోతుంది అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ఆపుతుందా!.. లేక నేను ఆపుతానా!.. ఎవరు కూడా ఆపాలని అనుకోరు. కాకపోతే ఒకసారి నరేంద్ర మోడీ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది మరుసటి రోజుకే చట్టంగా మారి అమలులోకి వస్తుంది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులు ఒకసారి విషయం గురించి మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకురండి మీతో పాటు మేము కూడా వచ్చి ఈ విషయంపై మాట్లాడుతామని.. స్పష్టం చేశారు. మాట్లాడితే, పోట్లాడితే పనులు కావు… మన రాష్ట్రంలోని మనం మనం కోట్లాడుకుంటే మాత్రం ఇక్కడ ఏది వర్కౌట్ కాదని… నేరుగా ప్రధానమంత్రి తోనే మాట్లాడితే త్వరగా పని అయిపోతుందని.. ఒకవేళ అతను కూడా ఈ విషయంపై వెంటనే ఒప్పుకుంటే.. మరుసటి రోజే ఈ బిల్లు అమలులోకి వస్తాయని అన్నారు. ఈనెల 18 రాష్ట్ర వ్యాప్తంగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ.. బంద్ కు సహకరిస్తామని అన్నారు. కానీ మన రాష్ట్రంలో ఏది కాదు… ఢిల్లీ వెళ్లి మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు.
Read also : తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బీసీ నేతల ఘర్షణ.. పిడిగుద్దుల దాడి, ఉద్రిక్తత.!
Read also : హైడ్రాతో హైదరాబాద్‌ను హడలెత్తించిన కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలి : MLC నవీన్