
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రస్తుతం భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య 5t20 ల సిరీస్ మ్యాచ్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగానే ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు ఆడిన టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా మూడవ టి20 మ్యాచ్ లో ఆడలేదు. బుమ్రా మూడవ టి20 మ్యాచ్ లో ఆడక పోవడం పట్ల చాలామంది కూడా ఏమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా బుమ్రా గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిరీస్ మధ్యలోనే బుమ్రా తప్పుకోవడం పట్ల బీసిసిఐ స్పందిస్తూ దానికి గల కారణాలను తెలిపింది. బుమ్రా కు తెలిసినటువంటి అత్యంత సన్నిహిత వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతోనే వెంటనే బుమ్రా ముంబైకి వెళ్లాల్సి వచ్చింది అని.. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మళ్లీ 4 లేదా 5 t20 మ్యాచ్ కు బుమ్రా జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి అని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. కాగా బుమ్రా మూడవ టి20 మ్యాచ్ లో ఆడక పోవడం పట్ల ఇప్పటికే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా స్పందించారు. తనకు బాగా కావాల్సిన వ్యక్తి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగానే బుమ్రా తనని చూడడానికి వెళ్లాల్సి వచ్చింది అని.. తిరిగి మళ్లీ త్వరలోనే జట్టులో చేరుతారు అని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు. దీంతో బుమ్రా అభిమానులు అందరూ కూడా కాస్త కుదుటపడ్డారు.
Read also : “మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్”.. ఉపాసన రికార్డ్!
Read also : కామారెడ్డి జిల్లాలో ఘోరమైన ఘటన.. కోపంతో ఓడిన అభ్యర్థిపై ట్రాక్టర్ తో ఢీ





