ప్రయాణికుడి వద్ద రివాల్వర్ బుల్లెట్లు పట్టుబడ్డడంతో విమానాశ్రయంలో కలకలం ఏర్పడింది. భద్రతా సిబ్బంది, ఎయిర్ పోర్టు అధికారులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో జరిగింది.
బుధవారం రాత్రి మధురపూడి విమానాశ్రయం నుంచిహైదరాబాదు వెళుతున్న సుబ్బరాజు అనే ప్రయాణికుడి వద్ద సెక్యూరిటీ స్కానింగ్ లో 6 బుల్లెట్లను ఎయిర్ పోర్ట్ ఎస్పీఎఫ్ గుర్తించారు. అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో ఓ ఫ్యాక్టరీ కి చెందిన సుబ్బరాజు తన వద్ద లైసెన్స్ గన్ ఉందని… అయితే బులెట్లు తన వద్ద ఉండిపోయాయని పోలీసులకు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బుల్లెట్లతో ప్రయాణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నిబంధనల ప్రకారంవిమానంలో లైసెన్స్ డ్ ఆయుధాలుతీసుకు వెళ్లాలంటే ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్ పోర్ట్ లో సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుంది. రివాల్వర్ లైసెన్స్ చూపిస్తే ప్రయాణికుడికి బుల్లెట్లు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.