
BSNL: ప్రస్తుత రోజుల్లో రూపాయి విలువ చాలా తగ్గిపోయింది. చిన్న పిల్లలు కొనుక్కునే చాక్లెట్ సైతం రూపాయికి దొరకని పరిస్థితి. ఏ వస్తువు తీసుకున్నా పదులు, వందలు, వేలు ఖర్చవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కూడా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. కేవలం ఒక్క రూపాయికే కొత్త సిమ్ కార్డు అందిస్తూ, 30 రోజుల పాటు ఉచిత 4జీ సేవలను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
దీపావళి బొనాంజా 2025- రూ.1కే సిమ్ కార్డు
బీఎస్ఎన్ఎల్ దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 15న ప్రారంభించిన ఈ రూ.1 ఆఫర్ నవంబర్ 15, 2025తో ముగియనుంది. సాధారణంగా కొత్త సిమ్ కోసం ప్రజలు అనేక రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఈ ఆఫర్‌లో మాత్రం కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. దాంతో పాటు నేరుగా 30 రోజుల పాటు పూర్తిగా ఉచిత నెట్‌వర్క్ బెనిఫిట్స్ అందుతాయి. టెలికాం రంగంలో ఇటువంటి ఆఫర్ చాలా అరుదుగా కనిపిస్తుంది.
రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. పూర్తిగా ఉచితం
రూ.1 ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులు 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ సేవలను పొందవచ్చు. రోజుకు 2జీబీ హై స్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ముఖ్యంగా కొత్త సిమ్ 4జీ నెట్‌వర్క్‌తో వస్తుంది కనుక వేగవంతమైన ఇంటర్నెట్‌ను అనుభవించవచ్చు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ వినియోగదారులు ఎక్కువగా లాభపడతారు.
ఎలా పొందాలి ఈ ఆఫర్?
ఆఫర్ పొందడానికి సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికృత రిటైల్ డీలర్ వద్దకు వెళ్లి కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వెంటనే సిమ్ కార్డు ఇస్తారు. దాన్ని రూ.1 ప్లాన్‌తో యాక్టివేట్ చేయాలి. మరిన్ని వివరాలకు 1800-180-1503కు కాల్ చేయవచ్చు లేదా bsnl.co.inని సందర్శించవచ్చు. నవంబర్ 15తో ఆఫర్ ముగుస్తుండడంతో ఆసక్తి గల వారు వెంటనే చేరుకోవడం మంచిది.





