
చండూరు, కైమ్ మిరర్:- చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన బొబ్బల శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ రెడ్డి) వారం, పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన రాజకీయ అరంగేట్రం విద్యార్థి నాయకుడిగా 2003లో ప్రారంభమైంది. టీఎన్‌ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు చండూరు రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. 2019లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాజకీయ నేతగా, విద్యార్థి నాయకుడిగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీఎస్ రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంతో ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు బీఆర్‌ఎస్ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే తాను పార్టీ మారుతున్నట్లు తన సన్నిహితులతో అంటున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే చర్చలు జరిగాయని ఇక కాంగ్రెస్ పార్టీలో చేరటమే తరువాయి అన్నట్లుగా తెలుస్తోంది.
Read also : ముందే మూతబడిన శివన్నగూడెం ప్రాథమిక పశువైద్య కేంద్రం..!
Read also : “పీపీపీ” పై వైసీపీది అనవసరపు రాద్ధాంతం : మంత్రి లోకేష్