
క్రైమ్ మిర్రర్ వికారాబాద్:- తెలంగాణలో సంవత్సరం కాలంగా కౌరవ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కోస్గి పట్టణ శివారులో అధికార పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు..లగచర్ల భూముల వ్యవహారాలకు వ్యతిరేకంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నిరసన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో కౌరవుల రాజ్యం..దుర్యోధనుని పాలనాల సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి.. అడ్డిలో గుడ్డిగా గెలిచి. 14 నెలల కాలంలో ఈ రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. 49 వేల 500 కోట్ల రుణమాఫీ డబ్బులకు గాను కేవలం 18 వేల లోపు రుణమాఫీ డబ్బులు వేశారన్నారు.రైతు భరోసా డబ్బులు ఇచ్చారా..?పెండ్లిలకు తులం బంగారం ఇచ్చారా..? యువతులకు స్కూటీలు ఏవి..? ఇవి అన్ని మరిచిపోయి అదానికి..రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు.. అల్లుడికి పేదల భూములను అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో కురుక్షేత్ర యుద్ధం సాగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి దుర్యోధనుని పాత్ర పోషిస్తూ కుట్రలు చేస్తూ ఉంటే..ఈ ప్రాంత ప్రజలు న్యాయం కోసం పాండవుల పోరాడుతున్నారని తెలిపారు. ఎప్పుడు ఊరు కూడా దాటని లగచర్ల గిరిజన మహిళలు ఢిల్లీకి చేరుకొని ఎస్సీ ఎస్టీ కమిషన్ల ముందు తమ వాదనలను వినిపించారని గుర్తు చేశారు.
అరవింద్ కేజ్రివాల్ ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం: ఎన్నికల వ్యూహకర్త
లగచర్ల భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టవు అన్న ముఖ్యమంత్రి..ఒకసారి కండ్లరా చూడు పచ్చని పంటలతో ఆ భూములన్నీ కళకళలాడుతున్నాయని ఏద్దేవా చేశారు.60 నుండి 70 లక్షలు ఎకరా పలికే ఆ భూములను 10 లక్షలకు తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అడ్డుకుంటే 70 మంది పై కేసులు పెట్టారని,వారిలో కాంగ్రెస్,బీజేపీ వారిని తప్పించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మొత్తం 40 మంది బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలపై కేసులు పెట్టి.. 40 రోజులకు పైగా జైలుకు పంపారని గుర్తు చేశారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలంతా ఇప్పుడు కసిగా ఉన్నారని,ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..ఎప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి.. సొంత నియోజకవర్గం అచ్చంపేటకు పంపడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలు అన్నింటిలోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్..కొడంగల్‌లో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..!
కోస్గిలో నేను రైతు నిరసన దీక్షకు వెళ్తున్నానా లేక కొడంగల్ లో ఉప ఎన్నిక వచ్చి రేవంత్ రెడ్డి ఓడిపోయి పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక చేసే విజయోత్సవ ర్యాలీకి వచ్చనా అన్నట్టుగా ఉంది… రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి.. 50 వేల ఓట్ల మెజారిటీతో పట్నం నరేందర్ రెడ్డి గెలవడం ఖాయం.. అలా గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా..” అని చాలెంజ్ చేశారు. అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మనుషులకు వేల కోట్ల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. అల్లుడికి కట్నం కింద ఇవ్వడానికే లగచర్ల భూములకు రేవంత్ సూటి పెట్టిండన్నారు
లగచర్ల బాధిత మహిళ బిడ్డకు నామకరణం…!
లగచర్ల బాధిత మహిళ జ్యోతి బిడ్డకు ‘భూమి నాయక్’ అని నామకరణం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవైపు కడుపులో ఉన్న బిడ్డ ఆగమైతదని బుగులైనా…మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తన భర్తను అన్యాయంగా జైల్లో పెట్టి చిత్ర హింసలు పెడుతున్నా..అన్నిటినీ దిగమింగి, బీఆర్ఎస్ పార్టీ సహకారంతో న్యాయం కోసం కొట్లాడింన్నారు.ఢిల్లీ దాకా పోయింది…కర్కశ కాంగ్రెస్ సర్కార్ పై విజయం సాధించిందన్నారు. తన భర్తను జైలు నుండి బయటకు తెచ్చుకుంది.. బిడ్డకు జన్మనిచ్చింది.. వీర వనిత లగచర్ల జ్యోతి అని కొనియాడారు. చిన్నారిని ఎత్తుకున్న కేటీఆర్.. భూమి నాయక్ అని పేరు పెట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,నిరంజన్ రెడ్డి,డాక్టర్ సి లక్ష్మారెడ్డి,మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్,సబితా ఇంద్రారెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి,చిట్టెం రామ్మోహన్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో!.. దయచేసి నా సినిమా లీక్ చేయకండి?
మహా కుంభమేళాలో దర్శనం ఇచ్చిన విజయ్ దేవరకొండ!..ఇలా ఉన్నాడేంటి బాబోయ్?