
చండూరు, క్రైమ్ మిర్రర్: -వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఏఐవిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యత్తపు మధుసూదన్ రావు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చండూరు మండలంలోని గ్రామ శాఖ నాయకులతో ఆయన సమీక్షించి మహాసభకు తరలి వెళ్లేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జెండా ఆవిష్కరణలు చేయాలన్నారు. ఊరూర,వాడవాడల నుంచి మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సిద్ధం అయ్యారు అన్నారు. కెసిఆర్ కాలంలోనే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రజలు మళ్లీ కెసిఆరే రావాలని కోరుతున్నారు అన్నారు. మహాసభకు తరలివచ్చే ప్రజలు, పార్టీ అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు.