-
పార్టీ నాయకులు యాక్టివ్‌గా లేరని ఎద్దేవా
-
కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేదు కాదు
-
మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు
-
జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్,క్రైం మిర్రర్ః
బీఆర్ ఎస్ పార్టీకి బీసీల పట్ల కనీస చిత్తశుద్ది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బీఆర్ ఎస్‌పై, కాంగ్రెస్ పార్టీ నిపులు చెరిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ ఎస్ ప్రచారం అసలు ఎన్నికల్లో కనిపించడం లేదని, కింది స్థాయిలో నాయకులు యాక్టీవ్‌గా లేదరని ఎద్దేవా చేశారు.
అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని ప్రస్తుతం పార్టీ పని తీరు బాగలదేని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు.
మూడునెలల్లో పార్టీ ఖరారు..
తాము ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని తెలిపారు. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నం.
మరో మూడు నెలల్లో పార్టీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. తాను ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతానని, తన మాటల్లో నిజాయితి లేకపోతే ప్రజలే నిలదీస్తారని పేర్కొన్నారు.





