అంతర్జాతీయం

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రాణా,ను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు.  వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ముంబై ఉగ్రవాది దాడి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్ రాణా,ను, ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని భారతదేశంలో న్యాయం ఎదుర్కొనేందుకు అప్పగిం చడానికి మా పరిపాలన ఆమోదం తెలిపిందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నానని, డోనాల్డ్ ట్రంప్ అన్నారు..

అతను న్యాయం ఎదుర్కొ నేందుకు భారతదేశానికి తిరిగి వెళ్తున్నాడు’’ అని ట్రంప్ అన్నారు.ముంబై ఉగ్రవాద దాడుల్లో దోషిగా తేలిన రాణా ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజిల్స్ జైలులో ఉన్నారు.

రాణాను అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్ మూలానికి చెందిన కెనెడియన్ పౌరుడైన రాణా, ఉగ్రవాద దాడుల్లో కీలక వ్యక్తి అయిన ‘‘దౌద్ గిలానీ’’గా పిలువబడే పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డెవిడ్ కోల్మన్ హెడ్లీతో సంబంధం కలిగి ఉన్నాడు.

దాడుల కోసం హెడ్లీ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు సాయం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా రాడికల్ ఇస్లా మిక్ ఉగ్రవాద ముప్పుని ఎదుర్కోవడానికి భారత్, అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా కలిసి పనిచే సాయి,అన్నారు. డోనాల్డ్ ట్రంప్  నేరస్థుల అప్పగింతకు అనుమతి ఇచ్చినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలు వివిధ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. వాణి జ్యం, ఇంధనం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.

Back to top button