Saturday, February 28, 2026
Homeతెలంగాణకేటీఆర్ ట్వీట్: బీఆర్ఎస్ చాన్స్ మిస్

కేటీఆర్ ట్వీట్: బీఆర్ఎస్ చాన్స్ మిస్

  • మద్యం కేసులో తీర్పుతో కవితకు మైలేజీ

  • ఆమె బీఆర్ఎస్ లో ఉండి ఉంటే పార్టీకి ఎంతో కలిసొచ్చేదన్న అభిప్రాయాలు

  • మద్యం కేసు వల్లే తాము అధికారం కోల్పోయామంటూ కేటీఆర్ ట్వీట్

  • అన్న వ్యాఖ్యలను తిప్పికొట్టిన కవిత

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోర్టు నిర్దోషిగా తేల్చినా.. ఆమె ఇప్పుడు తమ పార్టీలో లేకపోవడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో గులాబీ పార్టీ నేతలు ఉన్నారు.

కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండి ఉంటే.. కోర్టు తీర్పుతో వచ్చిన మైలేజీని పూర్తిగా ఆ పార్టీ నేతలు పొందేవారు. కానీ, ఆమె ఇప్పుడామె పార్టీలో లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు కూడా చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణా రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో జైలు జీవితాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుభవించారు.

అయితే తాజాగా కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేస్తూ, ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారనే సాక్షాదారాలు సమర్పించలేదని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో కవిత రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ఊరట లభించగా, జాగృతి నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన వివాదాస్పద కేసులో సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం సాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా, అధికారులు, వ్యాపారవేత్తలు నిందితులుగా చేర్చబడ్డారు. అందులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

కవిత ఈ కేసులో ఉండటంతో పాటు, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత తెలంగాణా జాగృతి ద్వారా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్న కవిత ప్రజలలో బలమైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీని త్వరలో ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన కవితకు ఇప్పుడు లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావటం ఆమెకు పెద్ద అవరోధం తొలగిపోయినట్టు అయ్యింది.

కోర్టు తీర్పుతో తెలంగాణ జాగృతి శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. తమ నాయకురాలిపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరితమని వారు ఎప్పటి నుంచో వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో తమ వాదనలకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు. కవిత రాజకీయ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఆమె మరింత చురుకుగా ప్రజాసేవలో పాల్గొంటారని జాగృతి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జాగృతికి కలిసివచ్చే అంశం…                                          ప్రస్తుత పరిణామం తెలంగాణ జాగృతికి పూర్తిగా కలిసివచ్చే పరిస్థితి ఉండగా.. బీఆర్ఎస్ మాత్రం దీంతో వచ్చే మైలేజీని కోల్పోయినట్లయింది. కవితపై మద్యం కేసు, ఆమె జైలుకు వెళ్లినందువల్లే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్న అభిప్రాయంతో ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు ఉన్నాయి.

అయితే కవిత జైలు నుంచి విడుదలయ్యాక చోటుచేసుకున్న పరిణామాలు, ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం, ఆమె సొంత పార్టీ పెట్టుకునే దిశగా ముందుకు సాగుతుండడంతో.. తాజా తీర్పుపై బీఆర్ఎస్ సంబరాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉండి ఉంటే.. కచ్చితంగా ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పు పరిణామాలను ఆ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఉండేది.

రాజకీయంగా బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున మైలేజీ లభించి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోగా.. మద్యం కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోవాల్సి వచ్చిందంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటనపై కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ఓడిపోయింది మద్యం కేసు వల్ల కాదని, అహంకారంతోనే ఓడిందని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments