Thursday, March 19, 2026
Homeతెలంగాణబీఆర్‌ఎస్‌ నాయకులు ముందస్తు అరెస్ట్‌

బీఆర్‌ఎస్‌ నాయకులు ముందస్తు అరెస్ట్‌

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :- కేసిఆర్ సిట్ విచారణ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిరసన కు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మహాదేవపూర్ మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను ఆదివారం పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా లింగంపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… బీఆర్ఎస్ సైనికులుగా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేసే దాకా కలిసికట్టుగా పని చేస్తామని, అటెన్షన్ డైవర్షన్ గేమ్ లు ఆడినా.. అర్జునుడి కన్ను మాదిరి రేవంత్ రెడ్డి అవినీతిపై, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు పైనే మా పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపది బాపు, మహాదేవపూర్ టౌన్ ప్రెసిడెంట్ కూరాతోట రాకేష్, యూత్ ప్రెసిడెంట్ అలీం ఖాన్, మరియూ సీనియర్ నాయకులు ప్రకాష్, బాపురావు, లక్షణ్, తదితరులు ఉన్నారు.

Read also : (VIDEO): అంతా చూస్తుండగా పెళ్లిలో ముద్దు పెట్టుకోబోయిన వధూవరులు.. కానీ

Read also :- Nirmala Sitaraman: విద్యార్థులతో సమావేశం కానున్న ఆర్థిక మంత్రి.. ఎందుకో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments