తెలంగాణరాజకీయం

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నేతల వినూత్న ప్రచారం..!

"మాట ముచ్చట" పేరుతో టీ దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలతో సన్నిహిత సంభాషణలు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయ వాతావరణం మార్పు చెందుతోంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఇటీవల ప్రారంభించిన ఒక వినూత్న ప్రచార ‘మాట-ముచ్చట’ కార్యక్రమం చేపట్టింది. మాట ముచ్చట పేరుతో టీ దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలతో సన్నిహిత సంభాషణలు జరుపుతున్నారు.

డివిజన్లు, బూత్ స్థాయి వరకు నేతలు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మాట ముచ్చట కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే సాధారణ ప్రజలతో నేరుగా సంపర్కం. టీ గ్లాసు పక్కన కూర్చొని సమస్యలు వింటున్నారు.

Also Read: తెలంగాణ ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..

రోడ్లు, డ్రైనేజీ, నిటి సరఫరా వంటి స్తానిక అంశాలు చర్చకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ప్రజల ఫిర్యాదులు నమోదు చేసుకుంటున్నారు. ఈ సంభాషణలు పార్టి భవిష్యత్ వ్యూహాలకు దోహదం చేస్తాయి.రాజకీయ పోటీలో బీఆర్ఎస్ మళ్లీ బలోపేతం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎదురవుతున్న సమస్యలు ప్రధాన చర్చా అంశం. ధరలు పెరగడం, ఉద్యోగాలు లేకపోవడం, అభివృద్ధి ఆగిపోవడం వంటి అంశాలు ప్రజలు లేవనెత్తుతున్నారు.

బీఆర్ఎస్ నేతలు గత పాలనలో చేసిన మంచి పనులు గుర్తు చేస్తున్నారు. ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతుందనే అంచనా వినిపిస్తోంది. ఈ చర్చలు రాజకీయ దృశ్యాన్ని మార్చే అవకాశం ఉంది. కార్యకర్తలు ఈ కార్యక్రమం ద్వారా కొత్త ఉత్సాహం పొందుతున్నారు.

Also Read: ఫర్టిలైజర్ షాప్ లో అర్ధరాత్రి దొంగతనం

జూబ్లీహిల్స్‌లో ఈ కార్యక్రమం విజయవంతమైతే ఇతర నియోజకవర్గాలకు విస్తరిస్తుంది. బీఆర్ఎస్ నాయకత్వం ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తోంది. ప్రజలతో నేరుగా మాట్లాడే ఈ విధానం పార్టి ఇమేజ్‌ను మెరుగుపరుస్తుంది. రాజకీయ పోటీలో బీఆర్ఎస్ మళ్లీ బలమైన శక్తిగా ఎదగనుంది. ఈ మాట ముచ్చట కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభిస్తుందని బావిస్తున్నారు రాజకీయ పెద్దలు..

Also Read: అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు : కిషన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button