క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తాజాగా సీఎంని ఉదేశిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలంగాణ గురించి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్న వీడియోని కేటీఆర్ ట్యాగ్ చేసి.. ఇలా రాస్కొచ్చారు.
గత పది సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు విధానాల వల్ల భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తెలియజేశారని కేటీఆర్ అన్నారు. అయితే “ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ అస్థిరమైన పూర్వ శిష్యుడికి అవగాహన కల్పించండి చంద్రబాబు” అని చంద్రబాబుకు ట్యాగ్ చేసి రాసుకోచ్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది.
ఏపీలో దారుణం!.. తల స్నానానికి 100 రూ… పురుగుల అన్నం పెడుతున్నారు! కేజీబీవీ విద్యార్థులు ఫైర్??
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో తెలంగాణ ఆర్థిక స్థితుల గురించి ప్రత్యక్షంగా ప్రశంసలు కురిపించిన విషయాలు చాలా సందర్భాలలో చోటుచేసుకున్నాయి. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నాయకులు తిప్పి కొడుతూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్న కేటీఆర్ నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి తేడా ఉందనేది రెండు పార్టీ నాయకులు కూడా తెగ చర్చిస్తున్నారు.
మంత్రిపదవి కోసం బ్లాక్ మెయిల్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారెటు!