క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో విజయాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యుద్ధప్రాతిపాదికన రంగంలోకి దిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డివిజన్ వారీగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో రహమత్‌నగర్ ఇన్ఛార్జిగా తక్కెళ్ళపల్లి రవీందర్రావు, యూసుఫ్‌గూడా ఇన్ఛార్జిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, షేక్‌పేట్ ఇన్ఛార్జిగా దాసోజు శ్రవణ్‌కుమార్, బోరబండ ఇన్ఛార్జిగా వివేకానందరెడ్డి, వెంగళరావు నగర్ ఇన్ఛార్జిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా మాధవరం కృష్ణారావును నియమించారు. Read alslo : జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయమంటూ పొన్నం ప్రభాకర్ జోస్యం! పార్టీ శ్రేణులు ప్రతీ డివిజన్లో బూత్ స్థాయి నుంచి మతపరమైన, సామాజిక వర్గాల వరకు సమన్వయం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లాలని కేటీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం చేయడం కోసం శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని సాధించేందుకు పార్టీ నేతలు విస్తృత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకర్షించే దిశగా వ్యూహం రూపొందిస్తున్నారు. మరి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అని రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మీరు ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. Read also : డిప్యూటీ సీఎం బాధ్యతలు పక్కనపెట్టి.. బాగా నటించినట్టున్నావ్ : అంబటి రాంబాబు