
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా రీల్స్ చేస్తూ తెగ ఫేమస్ అయిపోదామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి రీల్స్ వల్ల ఎంతోమంది మనుషులకు ఎఫెక్ట్ కావడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈమధ్య ఏకంగా దేవస్థానాలలో కూడా రీల్స్ చేయడంతో… నిజమైన భక్తులకు కోపంతో పాటు ఆవేశంతో దేవాలయాల అధికారులపై మండిపడుతున్నారు. దీంతో తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి… రీల్స్ అంటూ లేదా ఫోటో షూట్ అంటూ సాటి భక్తులకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్పునిచ్చింది. అలాగే శ్రీవారి ఆలయం ముందు కూడా రీల్స్ చేయడాన్ని నిషేధించింది. ఎవరైనా సరే అసభ్యకరమైన రీల్స్ దేవాలయాలు ముందు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ గా టీటీడీ సిద్ధమవుతుంది..
నిందితులంతా నిర్దోషులే.. మాలేగావ్ కేసులో సంచలన తీర్పు!
తిరుమల తిరుపతి దేవస్థానం ముందు లేదా తిరుపతిలో ఉన్నటువంటి వీధుల్లో రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు వెకిలి చేష్టలు చేస్తూ… అసభ్యకరంగా డాన్సులు చేస్తూ వీడియోలు చిత్రీకరించి అవి సోషల్ మీడియాలో పోస్టులుగా పెడుతూ ఉన్నారు. పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతర చర్యలు చేయడం నిషేధం. ఇలాంటి వీడియోలను విజిలెన్స్ టీం స్పెషల్గా గుర్తిస్తుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా పిచ్చిపిచ్చిగా డాన్సులు లేదా రీల్స్ చేస్తే… వారికి కఠిన చర్యలు తప్పవు.
అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఎప్పుడంటే?