
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ వాదనలు వినిపించగా.. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా మద్దతిచ్చాయని తెలిపారు. ప్రభుత్వం ఇంటింటికి కూడా సర్వే నిర్వహించి బీసీ లెక్కలు తేల్చిందని స్పష్టం చేశారు. అయినా కానీ సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో ప్రభుత్వానికే కాకుండా బిసి సంఘ నేతలకు అలాగే రాష్ట్రంలోని బీసీలకు కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి.
బీసీ రిజర్వేషన్లపై… లోని మరిన్ని వివరాలు మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో…