
క్రైమ్ మిర్రర్,వైరల్ న్యూస్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం పై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బస్సు ప్రమాదం వెనుక దాగి ఉన్న అసలు మిస్టరీని పోలీసులు కనిపెట్టారు. ఒక బైక్ కారణంగా బస్సు ప్రమాదం జరిగి మంటలు వ్యాపించి దాదాపు 20 మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే తాజాగా బైక్ పై ఉన్నటువంటి శివశంకర్ అనే వ్యక్తి గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో శివ శంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా… బైక్ ను స్పీడ్ గా నడపడం వంటి దృశ్యాలు కనిపించాయి. అయితే అతను వెనుక ఉన్నటువంటి ఎర్రి స్వామి అనే మరో వ్యక్తిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.
Read also : పథకాలను,చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం
శివశంకర్ మిత్రుడు ఎర్రి స్వామి మాట్లాడుతూ….
పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని అక్కడి నుంచి ఇద్దరం బైక్ పై వెళ్తున్నాం. అలా వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా బైక్ స్కిడ్ అయి కుడివైపు ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టగా ఇద్దరం అక్కడికక్కడే కింద పడిపోయాం. అయితే ఈ సందర్భంలో శివశంకర్ స్పాట్లోనే చనిపోయాడు. నాకు చిన్న చిన్న గాయాలైనా కూడా అక్కడి నుంచి భయంతో వెంటనే వెళ్లిపోయాను అని శివశంకర్ మిత్రుడు ఎర్రి స్వామి కీలక విషయాలను వెల్లడించాడు. ఇక అక్కడే ఉన్నటువంటి బైక్ ను బస్సు ఈడ్చికేల్లడంతో ప్రమాదం జరిగింది అని సంచలన విషయాలను తెలిపాడు. దీంతో ఈ ప్రమాదంలో ఒకవైపు శివశంకర్ ది మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ ది కూడా తప్పు ఉందని పోలీసులు నిర్ధారించారు. ఏది ఏమైనా కూడా ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది అగ్నికి ఆహుతి కాగా మరో కొంతమంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. కాగా ఈ బస్సు దగ్ధం ఘటన యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే.
Read also :<a style="color:red"
href="https://crimemirror.com/the-threat-of-rain-looming-over-telangana-for-how-many-days/”>రోహిత్ సూపర్ సెంచరీ… విరాట్ అద్భుతమైన హాఫ్ సెంచరీ!





