
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్- 2026 కు ముందుగానే స్టార్ ప్లేయర్స్ అలాగే విద్వంసకర ఆటగాళ్లు వరుసగా రిటైర్మెంట్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 2026 కు సంబంధించి ఐపిఎల్ కు సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డూప్లిసిస్ మరోవైపు వెస్టిండీస్ డేంజరస్ ఆటగాడు రసూల్ రిటైర్మెంట్లు ప్రకటించారు. కాగా నేడు మరో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ ఐపిఎల్ కు దూరం కాబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ నెలలోనే ఐపీఎల్ 2026 కు సంబంధించి మినీ వేలం జరగబోతుంది. ఈ మినీ వేలానికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతుంది. ఇక గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన గ్లెన్ మాక్సివల్ అంతగా రాణించలేదు. తాజాగా అతనిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. ఈ క్రమంలోనే మినీ వేలంలో పాల్గొనాలంటే కచ్చితంగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. కానీ మ్యాక్స్వెల్ మాత్రం రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. దీంతో ఈ స్టార్ ప్లేయర్ వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడడం కష్టమే అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ కు ఇలా ఒక్కొక్క ప్లేయర్ దూరమవుతూ ఉండగా ఈ ఆటగాళ్ల ఆటను మిస్ అవుతామని చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.
Read also : ఇంటికి వెళ్తాం.. మమ్మీ ని చూడాలని ఉంది అంటూ 2,3 ఏళ్ల పిల్లలు రిక్వెస్ట్!
Read also : యువత క్రీడల్లో రాణించాలి : ఎస్సై ఇరుగు రవి కుమార్





