
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-తెలుగుదేశం పార్టీ నేత మాలేపాటి సుబ్బ నాయుడు తాజాగా తుది శ్వాస విడిచారు. ఇతను ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ తో దాదాపు పది రోజులుగా విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం నెల్లూరు జిల్లా దగదర్తిలో సుబ్బ నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే సుబ్బ నాయుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం సుబ్బు నాయుడు అంత్యక్రియలలో భాగంగా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ప్రజలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇతను కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ప్రజలకు సేవలు అందించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా చాలా సపోర్ట్ గా నిలబడ్డారు. కావలి నియోజకవర్గ ప్రజలకు అలాగే గిరిజనుల సమస్యలపై ఎంతగానో పోరాడిన వ్యక్తి ఇతను.
Read also :మ్యాచ్ అనంతరం కన్నీరు పెట్టిన స్మృతి మందాన..!
Read also : సీఎం సెటైర్లకే సెటైర్ వేసిన వైసీపీ… ఎందులోనంటే?