
క్రైమ్ మిర్రర్, మునుగోడు న్యూస్ :- తెలంగాణ లో పెరుగుతున్న వాహనాల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో రహదారులను 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్ల వరకు వెడల్పు పెంచాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సూచనతో మొదటగా మునుగోడు నియోజకవర్గంలో 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్ల వరకు వెడల్పు పెంచుతూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మునుగోడు నియోజకవర్గంలోనీ 43 రోడ్లకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ – CRR 2024-25 నిధుల నుండి రూ.163 కోట్ల 85 లక్షలు మంజూరు చేయించిన మునుగోడు ఎమ్మెల్యే.
పంచాయతీ రాజ్ అధికారులు టెండర్లు పిలిచి,త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
గ్రామాల వారిగా రోడ్ల వెడల్పుకు మంజూరు అయిన నిధులు
1.పులిపలుపుల నుండి బీరెల్లిగూడం వరకు 3.35.కోట్లు
2.ఊకోండి నుండి తాళ్లవెల్లంల వరకు 2.40.కోట్లు
3.పులిపలుపుల నుండి ఊకోండి అడ్డ రోడ్డు వరకు 4.70.కోట్లు
4.కల్వలపల్లి నుండి కాశవారి గూడెం వరకు 6.50.కోట్లు
5.ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుండి రత్తుపల్లి గ్రామం వరకు 60 లక్షలు
6.ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుండి గంగోరిగూడెం వరకు 2.80.కోట్లు
7.వెల్మకన్నె నుండి కల్వకుంట్ల వరకు 5.కోట్లు
8.కచలాపురం నుండి వయా సింగారం నేరటోనీ గూడెం 5. కోట్లు
9.ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుండి గుండ్లోరిగూడెం వరకు 2.20.కోట్లు
10.ఆర్ &బి రోడ్ నుండి కొరటికల్ 80.లక్షలు
11.చొల్లేడు నుండి బోడంగిపర్తి వరకు 7 కోట్లు
12.మెయిన్ రోడ్డు నుండి జోగిగూడెం వరకు 1.70.కోట్లు
13.పుల్లెంల నుండి బోడంగిపర్తి వరకు 6.20.కోట్లు
14.శిర్దేపల్లి నుండి తాస్కానిగూడెం వరకు 3.85.కోట్లు
15.లక్కినేనిగూడెం నుండి చొప్పరివారి గూడెం వరకు 2.70.కోట్లు
16.PWD రోడ్డు నుండి పడమటి తాళ్ల వరకు 3.90.కోట్లు
17.మెయిన్ రోడ్డు నుండి దుబ్బగూడం వయా ఉడతల పల్లి 1.45.కోట్లు
18.కొరటికల్ నుండి శిర్దేపల్లి వరకు 7.80.కోట్లు
19.తిమ్మారెడ్డి గూడెం నుండి మల్లగుట్ట వరకు 2.75.కోట్లు
20.పుల్లెంల నుండి గొల్లగూడెం వరకు 4.10.కోట్లు
21.గట్లమల్లేపల్లి నుండి తుమ్మలపల్లి వరకు 4.55.కోట్లు
22.కేతెపల్లి నుండి తిరుమలగిరి వరకు 3.20.కోట్లు
23.కొండమల్లేపల్లి నుండి బండ తిమ్మాపురం 2.70.కోట్లు
24.అంతంపేట నుండి గట్టుప్పల్ వరకు 6.30.కోట్లు
25.బట్లపల్లి నుండి వట్టిపల్లి వరకు 2.50.కోట్లు
26.చిట్టెంపహాడ్ నుండి తిరుమలగిరి వరకు 6.కోట్లు
27.పలివెల – సర్వేలు రోడ్డు నుండి కోతులారం గ్రామంలోకి 3.70.కోట్లు
28.చలిమెడ నుండి బోత్తళ్ళగూడెం 1.75.కోట్లు
29.కిష్టాపురం రోడ్డు నుండి ఎలగలగూడెం వరకు 4.50.కోట్లు
30.చండూరు ఆర్ అండ్ బి రోడ్డు నుండి దుబ్బకాలువ రోడ్డు వరకు 85 లక్షలు
31.చండూరు ఆర్ అండ్ బి రోడ్డు వయా బుడగ జంగాల కాలనీ లక్ష్మీదేవిగూడెం వరకు 1.50.కోట్లు
32.కచలాపురం – కిష్టాపురం చిన్నకాపర్తి 6.50.కోట్లు
33.ఓల్డ్ కల్వకుంట్ల నుండి కొంపెల్లి- కొండపురం రోడ్డు వయా వెంకటేశ్వర నగర్ 3 కోట్లు
34.మెయిన్ రోడ్డు నుండి సోలిపురం వరకు 3.85.కోట్లు
35.సరంపేట నుండి శివన్నగూడెం వరకు 1.80.కోట్లు
36.తిమ్మారెడ్డి గూడెం నుండి తుమ్మలపల్లి వరకు 3.90.కోట్లు
37.తూప్రాన్ పేట్ – కాట్రేవు నుండి ఎల్లంబాయి వరకు 2.15.కోట్లు
38.డి.నాగారం నుండి పీపల్ పహాడ్ అల్లాపూర్ రోడ్డు వయా మహా విష్ణు టెంపుల్ వరకు 4.కోట్లు
39.అల్లాపూర్ తుంబాయి తండా రోడ్డు నుండి సరళ మైసమ్మ టెంపుల్ వరకు 8.కోట్లు
40.సింగరాయ చెరువు నుండి తమ్మ డోనీ బావి
5.70.కోట్లు
41.పెద్దకొండురు నుండి సప్పిడివారిగూడెం 5.20.కోట్లు
42.చిన్న కొండూర్ రోడ్డు జూబ్లకపల్లి నుండి మసీదుగూడెం వయా tokahelka 3.90.కోట్లు
43.పంతంగి విలేజ్ నుండి శనిగల గుట్ట వరకు 3.50.కోట్లు
రాస్తారోకో – ధాన్యం కొనుగోలుపై రైతుల ఆందోళన
తిరంగ ర్యాలీని విజయవంతం చేయండి :- బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడు