
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తాజాగా కన్నుమూశారు. ఈరోజు బారామతి లో బహిరంగ సభలో పాల్గొనేందుకు విమానంలో బయలుదేరిన అజిత్ పవర్ సాంకేతిక లోపం కారణంగా ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ విమానం కుప్పకూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగి తీవ్ర గాయాల పాలయ్యారు. కానీ చివరికి ఈ విమాన ప్రమాదంలో అతనికి మరణం తప్పలేదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటుగా ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి మరో ఆరుగురు మృతి చెందారు. సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని చూసినటువంటి స్థానిక ప్రజలు అలాగే ప్రత్యక్ష సాక్షులు కొన్ని కీలక విషయాలను తెలిపారు. విమానం నేలను గట్టిగా ఢీకొనడంతోనే భారీగా మంటలు చెలరేగి ఆ విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా మృతి చెందారు అని అంటున్నారు. ఈ ఘటన సరిగ్గా ఉదయం 8 గంటల 45 నిమిషాల సమయంలో జరిగింది అని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం దుర్మరణంతో ఆయన అభిమానులు తోపాటు కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
Read also : యూరియా సెగ… రైతన్నకు కన్నీరునే మిగిల్చిన ఆన్లైన్ బుకింగ్..!?మాయం
Read also : Contact





