
చండూరు, క్రైమ్ మిర్రర్:- డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాస్ నేతకు అవమనం జరిగింది. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బిగ్ టీవీ స్టాప్ రిపోర్టర్ రమేష్ తండ్రి దశదినకర్మను బుధవారం చండూరు మున్సిపాలిటీ అంగడిపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాస్ నేత కూడా హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్టేజి పైన ఉండగా డిసిసి ప్రెసిడెంట్ పున్నకైలాస్ నేత స్టేజ్ పైకి వెళ్లేందుకు చూడగా పోలీసులు నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెళ్లిపోయే వరకు కూడా సామాన్యుల పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కూడా తనను స్టేజి పైకి వెళ్లకుండా చేసిన విషయం పైన పున్న కైలాస్ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టే తనని ఇలా అవమానిస్తున్నారు అంటూ పున్న కైలాస్ నేత చెప్పుకొస్తున్నారు.
Read also ::31 నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్.. 100 వాహనాలు సీజ్
Read also : పేలిపోతున్న మొబైల్ ఫోన్లు.. కారణాలు ఇవే?





