ఆంధ్ర ప్రదేశ్

బ్రేకింగ్ న్యూస్.. కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా బస్సులోనే అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో.. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వమే అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వారిపై ఓ వ్యక్తి కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదం పై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాదాపు 27 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ముఖ్యంగా వైసీపీ అధికారిక X పేజీ నిర్వాహకురాలు, యాంకర్ శ్యామల, కందూరి గోపికృష్ణ, సి.వి.రెడ్డి ఇంకా మరి కొంతమంది ఉన్నట్లు సమాచారం అందింది. కాగా వీరందరూ కూడా కర్నూల్ లో జరిగినటువంటి బస్సు ప్రమాదం గురించి ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ బస్సు ప్రమాదానికి ముఖ్యంగా కల్తీ మద్యం, బెల్ట్ షాపులే కారణమని.. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని అతను పేర్కొన్నారు. దీంతో మళ్లీ తెరపైకి ఈ అంశం రావడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు పై ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం పట్ల గట్టిగానే రాజకీయ వేడి రాజుకుంది. ఈ బస్సు ప్రమాదం పట్ల రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కొంతమంది కావాలనే మద్యం వైపు మళ్ళించి దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఇప్పటికే కూటమి నాయకులు ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు.

Read also : కొలికపూడి vs కేశినేని చిన్ని మధ్య వివాదం.. సీఎం రియాక్షన్ ఇదే?

Read also : యాదాద్రి ఇంచార్జి ఎస్ఈ రామారావు అవినీతి చిట్టా.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button