
క్రైమ్ మిర్రర్,వైరల్ న్యూస్ :-ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ వ్యాధి కారణంగా చనిపోయిన సంఘటనలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్యాన్సర్ వ్యాధి ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ చాలామంది క్యాన్సర్ ఉందా?.. లేదా?.. అని తెలియక.. అకస్మాత్తుగా మరణిస్తున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా మెడికల్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్యాన్సర్ లక్షణాలను వెల్లడించింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్యాన్సర్ లక్షణాలు
1. అతిగా బరువు తగ్గిపోవడం
2. విపరీతమైన జ్వరం
3. ఎక్కువగా అలసట
4. మూత్రం వదిలే సమయంలో నొప్పి రావడం
5. మూత్రంలో రక్తం రావడం
6. చిన్న గాయాలు అయినా కూడా ఎక్కువ కాలం పాటు మానకపోవడం
7. రొమ్ములు, గ్రంధులు, కణజాలాలు గట్టిగా మారడం
8. స్కిన్, బ్రెస్ట్, పెద్ద పేగు, లుకేమియా వ్యాధులు కలిగినప్పుడు
9. పుట్టుమచ్చలు పెరిగిపోయి వాటి నుంచి రక్తం కారడం
పైన పేర్కొన్న అన్నీ కూడా క్యాన్సర్కు ముఖ్య లక్షణాలు అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వైద్యులు ప్రకటించారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్లను సంప్రదించాలి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
Read also : ముఖ్యమంత్రి రేవంత్ కి సవాలుగా మరీనా మరో మంత్రుల వివాదం…!
Read also : “AA22” పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అట్లీ.. ఇది మరో అద్భుతం!