సినిమా

బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది… కానీ మిగతాదంతా ఓకే!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నిర్మాతలు ధనవంతులు అయ్యారు. మరి కొంతమంది నిర్మాతలు కోట్లని పోగొట్టుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఒకే ఒక్క దిల్ రాజ్ మాత్రం అందరూ నిర్మాతలకు భిన్నంగా నిలిచారు. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాది పొడుగునా వివిధ సినిమాలకు నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తూ బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు దిల్ రాజ్. ఈ రోజుల్లో సినిమా పరంగా ఫర్ఫెక్ట్ బిజినెస్ మాన్ అనగానే ప్రతి ఒక్కరికి దిల్ రాజు గారు గుర్తుకు వస్తారు. అయితే దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో వారి బ్రాండ్ వ్యాల్యూకు తగ్గ సినిమాలు మాత్రం రావడం లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఈ సీనియర్ నిర్మాత దిల్ రాజు పరిస్థితులు మాత్రం ఇప్పుడు సరిగా అతనికి అనుకూలించడం లేదు.

దిల్ రాజ్ తాజాగా నిర్మించిన సినిమాలైతే బాక్సాఫీస్ వద్ద వరుస ఘోర పరాభవాలు చవి చూడడం జరిగింది. ఒకప్పుడు దిల్ రాజు అంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉండేది. దిల్ రాజ్ బ్యానర్ లో ఏదైనా ఒక సినిమా వస్తే కచ్చితంగా అది మంచి సినిమా అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కట్టేవారు. ఇక అదే సమయంలో హీరోల ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో దిల్ రాజ్ బ్యానర్లో సినిమా చేయాలంటూ కూడా ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తెలియజేసేవారు. అయితే గత మూడు సంవత్సరాలుగా దిల్ రాజుకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. దిల్ రాజ్ సినిమాలకు సంబంధించి తాజాగా ఎక్కువగా నెగిటివ్ టాక్ రావడం, భారీ నష్టాలు మిగలడం వంటివి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆర్య, బొమ్మరిల్లు మరియు శతమానం భవతి లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఈమధ్య అసలు రావడం లేదు. అలాగే తాజాగా వచ్చినటువంటి “తమ్ముడు” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో భారీ నష్టాలను చవిచూశారు దిల్ రాజ్. దీంతో దిల్ రాజు నిర్మాణంలో తరువాత వస్తున్నటువంటి రౌడీ జనార్ధన్ మరియు ఎల్లమ్మ అనే రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు హిట్ అయితే తప్ప దిల్ రాజ్ బ్రాండ్ వేల్యూ అలానే కొనసాగుదు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్‌

సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button