తెలంగాణవైరల్

Brahmanandam: చనువుతో అలా తోసేశా, వివాదంపై బ్రహ్మానందం క్లారిటీ!

ఫోటో అడిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లిని తోసేసి వెళ్లిన ఘటనపై బ్రహ్మానందం స్పందించారు. అది సరదాగా చేసిందే తప్ప, కావాలని చేసిందికాదన్నారు. ఈ మేరకు ఓ వీడియో వివరణ ఇచ్చారు.

Brahmanandam Clarification Video: సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జరిగిన హైదరాబాద్ లో ఓ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో హాస్యనటుడు బ్రహ్మానందం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఉన్నారు. కార్యక్రమం సందర్భంగా ఎర్రబెల్లి, బ్రహ్మానందాన్ని ఫొటో దిగుదామని అడిగారు. బ్రహ్మానందం ఇందుకు సరదాగా నో చెప్పారు. పైగా ఆయను బ్రహ్మానందం తోసేసి వెళ్లుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎర్రబెల్లితో ఫొటోకు బ్రహ్మానందం నో చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా బ్రహ్మానందం స్పందించారు.

బ్రహ్మానందం ఏం చెప్పారంటే?

ఎర్రబెల్లితో జరిగింది కేవలం సరదా మాత్రమేనని, చాలా మంది అపార్థం చేసుకున్నారంటూ బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు.  “ఉదయాన్నే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్‌కు వెళ్లాను. బాగా రాత్రి అయిందని హడావుడిగా ఉన్నాను. అంతలోకే దయా అన్న ఎదురయ్యాడు. పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత.. “రాన్న రాన్న ఫొటో తీసుకుందాం” అని అన్నారు. నేను ఫొటో వద్దు ఏమీ వద్దు అని అక్కడినుంచి వచ్చేశా. అది చాలా మంది మిత్రులు అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు.’’

’’దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులు. నేనంటే ఎంతో అభిమానంగా, ప్రేమతో చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతో నేను అలా సరదాగా తోసేశాను. దాన్ని నేను కావాలనే చేసినట్లు కొంతమంది మీడియా మిత్రులు అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. తర్వాత కూడా ఆయన, నేను ఫంక్షన్‌లో చాలా సేపు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూసి ఆయన, నేను నవ్వుకున్నాం. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అలాంటిదేమీ లేదు” అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button