
క్రైమ్ మిర్రర్, అనంతపురం :- ఈ రోజుల్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది బిడ్డల ప్రాణాలను కోల్పోతున్నారు. చిన్నచిన్న కారణాలవల్ల.. తెలిసి తెలియక 1, రెండు సంవత్సరాల పిల్లలు మృత్యువు ఒడికి చేరుతున్నారు. అభం శుభం తెలియని ఎంతోమంది చిన్న పిల్లలు… అర్థం అయ్యి, కానీ వయసులోనే దేవుడు చెంతకు వెళ్తున్నారు. కొంతమంది కాలువలో పడి, మరి కొంతమంది పప్పు డబ్బాలలో ఇరుక్కుపోయి, మరి కొంతమంది చిన్నపిల్లలు తెలిసి తెలియక నోట్లో ఏదో ఒక వస్తువును మింగుతున్న సమయంలో ఊపిరాడక చనిపోయిన సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది.
Read also : శ్రీకాళహస్తిలో తగ్గిన ఆడపిల్లల జననాలు.. దేవుడి శాపమా!.. మానవ తప్పిదమా..?
ఇక అసలు వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా, గుత్తి శివారులోని NPTC పవర్ గ్రిడ్ ఆఫీస్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన మౌనిక పవర్ గ్రిడ్ లోని ట్రాన్స్కో వింగ్ లో ADE గా పనులు నిర్వహిస్తున్నారు. నైట్ డ్యూటీకి తన కుమారుడు రక్షిత్ రామ్ అనే 18 నెలల బాలుడిని తనతో పాటుగా తను పనిచేసే చోటికి తీసుకెళ్లింది. ఇక అక్కడ తన తల్లి తన పని చేసుకుంటూ ఉండగా.. తన కొడుకు వాటర్ బాటిల్ తో ఆడుకుంటూ ఉన్నాడు. చిన్నపిల్లలు సహజంగా ఆడుకుంటారు అనుకొని తన తల్లి మౌనిక సహజంగా తన పని తను చేసుకుంటుంది. అయితే ఆడుకుంటూ… ఒక్కసారిగా పొరపాటున మూత మింగడంతో ఆ బాలుడికి ఊపిరి ఆడలేదు. వెంటనే ఇది గమనించిన తన తల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఊపిరాడక చనిపోయాడు అని డాక్టర్లు తెలిపారు. దీంతో తన తల్లి ఆసుపత్రిలో బాలుని చూస్తూ తలడిల్లిపోయింది. ఇది చూస్తున్న బంధువులు, స్థానిక ఆసుపత్రిలోని వ్యక్తులు కంటతడి పెట్టకున్నారు. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లల పై ఒక కన్ను వేసి ఉంచాలని సూచిస్తున్నారు.
Read also : తేలని తురకపాలెం మిస్టరీ.. భయపెడుతున్న బెజవాడ ఇష్యూ..!